రూ.2.41 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు గత మూడేళ్లలో రద్దు

Admin 2018-04-04 Business

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు గత మూడేళ్లలో రూ.2.41 లక్షల కోట్ల విలువైన రుణాలను రద్దు చేశాయని రాజ్యసభకిచ్చిన సమాచారంలో తెలిసింది. బ్యాలెన్స్‌షీట్లను ప్రక్షాళించుకోవడానికి బ్యాంకులు తరచుగా మొండి బకాయిలను రద్దు చేస్తుంటాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా తన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద లభించిన గణాంకాల ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి సెప్టెంబరు 2017 వరకు రూ.2,41,911 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేశాయ’ని ఆయన తెలిపారు.

Previous Post