ఆ జీన్స్‌తో ఎంతో కంఫర్ట్‌: రంగమ్మత్త

Admin 2018-04-04 Cinema

రంగమ్మత్త రంగు రంగుల క్యాజువల్‌ క్యాస్టూమ్స్‌, పార్టీ వేర్‌కు బదులు.. సమ్మర్‌ వేర్‌ ధరించి సందడి చేశారు. సాధారణ జీన్స్‌ ఫ్యాషన్‌ ముగిసింది. ఇప్పుడంతా టోర్న్‌, రిప్డ్‌ జీన్స్‌ ఫ్యాషన్‌ వచ్చేసింది. ఎక్కడా చూసిన పెద్ద పెద్ద రంధ్రాలతో కూడిన టోర్న్‌ జీన్స్‌ సమ్మర్‌లో మంచి కంపర్ట్‌ ఇవ్వడంతో కుర్రకారు వాటివెంట పరుగులు తీస్తున్నారు. వేలకు వేలకు పోసి కొనుక్కుని ట్రెండీగా కనిపిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలోకి జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కూడా చేరారు.

తెల్లని గీతలతో కూడిన నల్లని షర్ట్‌, టోర్న్‌ జీన్స్‌ ధరించి ‘ఇవి.. ఫ్యాషన్‌ అండ్‌ సమ్మర్‌ స్పెషల్‌’ అంటున్నారు అనసూయ. టోర్న్‌ జీన్స్‌తో చాలా కంఫర్ట్‌ అంటూ గోల్డ్‌ కలర్‌ గాగుల్స్‌తో ఫోటోలకు ఫోజిస్తూ ఈ బుల్లి తెర యాంకర్‌ హొయలు పోయారు. ఇప్పటికే వెండితెరపై పలు సినిమాల్లో నటించిన అనసూయ తాజాగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో అనసూయ ఆనందం పట్టలేకపోతున్నారు. సినిమాకు ఊపిరిలాంటి అంత గొప్ప క్యారెక్టర్‌ని తనకిచ్చినందుకు ఆమె సుక్కూకు కృతజ్ఞలు తెలిపారు.

Previous Post