ఎన్టీఆర్‌ బయోపిక్‌ : శ్రీదేవి పాత్రలో దీపికా..?

Admin 2018-04-04 Cinema

భారత సినీచరిత్రలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన శ్రీదేవి బాలీవుడ్‌లోనే కాకుండా, తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అభిమాన నాయికగా అలరించారు. ఆమె హఠాన్మరణంపై జాతి యావత్తూ దిగ్భ్రాంతికి లోనైంది. వెండితెరపై ఆమె స్ధానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నది నిర్వివాదం. తాజాగా టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రలో దీపికా పదుకోన్‌ నటిస్తారని ప్రచారం సాగుతోంది.

గతంలో ఎన్టీఆర్‌, శ్రీదేవి కాంబినేషన్‌లో వేటగాడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి వంటి బ్లాక్‌బస్టర్‌లు సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో శ్రీదేవి పాత్ర కొద్దిసేపు ఉంటుందని, ఈ పాత్ర కోసం దీపికాను చిత్ర బృందం సంప్రదించినట్టు సమాచారం. దుబాయ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓ వివాహానికి హాజరైన శ్రీదేవి హోటల్‌ గదిలో అనూహ్యంగా మరణించిన విషయం తెలిసిందే.

Previous Post