సాహో : అబుదాబిలో ఒళ్లు గగుర్బొడిచే సీన్లు, ఇండియా నుండి 300 మంది టీం!

Admin 2018-04-08 Cinema

సాబు సిరిల్... ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాహుబలి సినిమా కోసం ఆయన వేసిన భారీ సెట్టింగులు చూసి ప్రేక్షక లోకం ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం సాబు సిరిల్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాకు పని చేస్తున్నారు. ఓ ప్రముఖ మేగజైన్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా కోసం అబుదాబిలో భారీ సెట్ వేస్తున్నట్లు వెల్లడించారు.

గత నెలన్నర రోజలుగా.....

సాహో సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ఏప్రిల్ 12 నుండి అబుదాబిలో షూట్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన సెట్స్ కోసం సాబు సిరిల్ అండ్ టీమ్ గత నెలన్నర రోజులుగా అక్కడ పని చేస్తున్నారట. ఈ విషయాన్ని సాబు సిరిల్ స్వయంగా వెల్లడించారు.

ఆరు నెలలుగా కసరత్తు అబుదాబిలో ఎక్కడ షూట్ చేయాలి, ఎలాంటి సెట్టింగుల వేయాలి అనే దానిపై గత ఆరు నెలలుగా సాబు అండ్ టీమ్ అబుదాబిలో వివిధ ప్రాంతాలు పర్యటించారు. గత ఆరు నెలలుగా ఆయన 8 సార్లు అబుదాబి వెళ్లి వచ్చారట.

150 కోట్ల భారీ బడ్జెట్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో చిత్రం 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

Previous Post