సల్మాన్‌ కోసం బిల్డింగ్‌ ఎక్కబోయిన బాలిక

Admin 2018-04-04 Cinema

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు ఉన్న క్రేజేంటో అందరికీ తెలిసిందే. ఆయన్ను ఒక్కసారైనా కలవడానికి అభిమానులు ఎంతకైనా తెగిస్తారు. ఇటీవల ఓ యువతి సల్మాన్‌ నా భర్త అంటూ అతని ఇంటి మేడ మీదకు ఎక్కి హల్‌చల్‌ సృష్టించింది.

ఇప్పుడు ఓ 15 ఏళ్ల బాలిక సల్మాన్‌ను కలవడానికి ఏకంగా ఇంట్లో నుంచి పారిపోయింది. మధ్యప్రదేశ్‌లోని బెరాసియా పట్టణానికి చెందిన ఓ బాలిక సల్మాన్‌కు వీరాభిమాని. సల్మాన్‌ను ఎలాగైనా కలవాలని ఆదివారం ఇంట్లో నుంచి పారిపోయి ముంబయి వెళ్లే సుదూర ప్రయాణం చేసే రైలు ఎక్కేసింది.

మంగళవారం రైలు ముంబయిలోని బాంద్రా టెర్మినల్‌లో ఆగగానే అక్కడ దిగి నేరుగా సల్మాన్‌ నివసిస్తున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌కు వెళ్లింది. లోపలికి వెళ్లేందుకు యత్నించింది కానీ భద్రతా సిబ్బంది ఒప్పుకోలేదు. దాంతో ఏకంగా బిల్డింగ్‌‌ గోడ ఎక్కాలని చూసింది. వెంటనే సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు బాలికను బాలల సంరక్షణ గృహానికి తరలించారు. బాలిక ఆధార్‌ కార్డు వివరాలను పరిశీలించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

Previous Post