రూ.200 కోట్లతో 1500 పల్లెవెలుగు బస్సుల కొనుగోలు

Admin 2018-04-04 Politics

అమరావతి: రాష్ట్రంలో 200కోట్ల రూపాయలతో 1500బస్సులను కొనుగోలు చేసి వాటిని పల్లెవెలుగు సర్వీసుల కోసం వినియోగిస్తామని రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రకటించారు. వచ్చే ఐదారు నెలల్లోనే ఈ సర్వీసులు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతాయని ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానమిచ్చారు. ఆర్టీసీకి ఉన్న బస్సుల్లో 48శాతం పల్లెవెలుగు కోసమే వినియోగిస్తున్నామని ఆయన వెల్లడించారు. విద్యార్థుల బస్ పాస్‌, ఇతరత్రా పాస్‌లు ఆర్టీసీ ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆర్టీసీ సర్వీసుల వెనకాలే ఆటో సర్వీసులు కిక్కిరిసి రావడంతో బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయని మంత్రి వివరించారు. అంతకుముందు ఎమ్మెల్సీ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పల్లెవెలుగు సర్వీసులను ఆదాయవనరుగా మార్చుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు.

Previous Post