చంద్రబాబు టార్గెట్‌ అదే..!

Admin 2017-12-30 Cinema

పేదల భూములు కొట్టేసి ఆస్తులు సంపాదించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులు పనిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో బెదిరించి 33 వేల ఎకరాల భూమిని లాక్కుని రైతులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. టీడీపీ నేతలు చాలా చోట్ల రికార్డులు తారుమారుచేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘2017ను టీడీపీ భూకబ్జాల సంవత్సరం’గా అభివర్ణించారు. హుద్‌హుద్‌లో భూరికార్డులు హుష్‌కాకి.. : ‘‘రైతులు, కూలీలను ద్వేషించే చంద్రబాబు నాయుడు.. హుద్‌హుద్‌ తుఫాను తర్వాత రెవెన్యూ రికార్డులను మాయం చేసి, విశాఖ జిల్లాలో లక్షల ఎకరాలను కాజేశారు. ఆ కుంభకోణంపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగలేదు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రాజధాని రైతులను బెదిరించి 33 వేల ఎకరాలను కాజేశారు. దాంతో లక్షల మంది రైతు కూలీలు, కౌలు రైతుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని కోర్టులు మొట్టికాయలు వేసినా టీడీపీ సర్కారు తీరు మారలేదు. గడిచిన మూడున్నరేళ్లలో వేలమంది రైతుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయే తప్ప రాజధానిలో శాశ్వత నిర్మాణమంటూ ఒక్కటీ జరగలేదు. అసలు రాజధానిని కట్టాలన్న ఆలోచన


Rating : 5

Previous Post