సినిమా చూపించిన చంద్రబాబు

Admin 2018-04-04 Politics

విలేకరులు అడిగిన వాటిల్లో కనీసం ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు కూడా తిన్నగా సమాధానం చెప్పకుండా, తన పంథా ఏమిటో వెల్లడించకుండా, సీరియస్‌గా సాగుతోన్న హోదా పోరాటాన్ని పలుచన చేసే ప్రయత్నం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఢిల్లీ పర్యటన రెండో రోజైన బుధవారం ఆయన జాతీయ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. కాన్‌స్టిట్యూషనల్‌ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు వెంట ఫిరాయింపు ఎంపీలు కూడా ఉన్నారు.

ముందు సినిమా: ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ప్రారంభంలో.. ఏపీకి జరిగిన అన్యాయాలను వివరిస్తూ చంద్రబాబు నాయుడు కొన్ని వీడియోలను ప్రదర్శించారు. 2014 ఎన్నికల ప్రచారంలో, అమరావతి శంకుస్థాపన సమయంలో నరేంద్ర మోదీ మాటలు, వాటికి వెంకయ్య నాయుడి అనువాదం వీడియోలను చూపించారు. అటుపై తాను ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి గల కారణాలను ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో ప్రధాని మోదీపైనా, బీజేపీపైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చివరి అంకంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

Previous Post