ఇంకొక అవకాశం ఇవ్వండి.. సరిదిద్దుకుంటాను – Facebook CEO

Admin 2018-04-05 Social

భారీ మొత్తంలో Facebook వినియోగదారుల సమాచారం తస్కరించబడిందన్న నేపధ్యంలో ఇప్పటికే పలు సందర్భాల్లో తన తప్పుని ఒప్పుకొన్న Facebook CEO మార్క్ జుకెర్‌బెర్గ్ తాజాగా మరోసారి స్పందించారు.

Facebookకి నాయకత్వం వహించడానికి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. తాజా స్కాండల్ నేపథ్యంలో Facebook బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మిమ్మలను బాధ్యతలనుండి తప్పుకోమని డిమాండ్ చేస్తారా అని అడిగినప్పుడు.. అలాంటి డిమాండ్ వచ్చే అవకాశమే లేదని.. కంపెనీకి సారథ్యం వహించడానికి తనకు మరో అవకాశం ఇవ్వాలని మార్క్ కోరారు.

“అవును.. ఇది పెద్ద తప్పు. నా తప్పు కూడా. మనుషుల తప్పులు చేస్తారు. అలాగే నేనూ చేశాను. మా బాధ్యతలు ఏమిటో లోతుగా గ్రహించకుండా తప్పు చేసాను. అయితే ఆ తప్పును సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను. అది నా బాధ్యత. Facebookని మొదలుపెట్టి ఎన్నో ఏళ్ల పాటు నిర్వహించాం. ఇక్కడ జరిగే ప్రతి దానికి నేను బాధ్యత వహిస్తాను” అంటూ మార్క్ వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకు కేంబ్రిడ్జ్ అనలటికా వ్యవహారం వల్ల డేటా భారీగా దుర్వినియోగం చేయబడిందని నేను భావించట్లేదు. అయితే డేటా కచ్చితంగా సురక్షితంగా ఉండాలి. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు అని ఆయన అన్నారు.

కేంబ్రిడ్జ్ అనలటికా వ్యవహారం వలన ఏ స్థాయి నష్టం జరిగిందో ఇప్పటికి అర్థం కానివారికి Facebook CEO ఇంతగా స్పందించడం చూస్తే పరిస్థితి తీవ్రత కొద్దిగానైనా అర్థం కావచ్చు. అందుకే మీ ఫేస్బుక్ అకౌంట్లో థర్డ్-పార్టీ అప్లికేషన్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.

Previous Post