డెలివరీ బాయ్స్ తో గొడవకు దిగుతున్న ఇ-కామర్స్ కస్టమర్లు!

Admin 2018-04-05 Social

అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్లలో ఏదైనా వస్తువు ఆర్డర్ పెట్టినప్పుడు అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూడటం ప్రతి ఒక్కరికి అలవాటే.

తమ వస్తువు కొద్దిగా ఆలస్యంగా వచ్చినా చాలామంది సహనం కోల్పోరు. కానీ దేశవ్యాప్తంగా ఈమధ్య జరుగుతున్న సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివిధ వస్తువులు డెలివరీ ఇవ్వడానికి వెళుతున్న డెలివరీ బాయ్స్ మీద కొంతమంది కష్టమర్లు దాడులకు దిగుతున్నారు.

వస్తువులు ఆలస్యంగా వస్తే అసలు సహించలేకపోతున్నారు. అప్పటికి అమెజాన్, flipkart వంటి షాపింగ్ సైట్లు పెద్దపెద్ద నగరాలకు ముందే చెప్పబడిన తేదీ లోపల వస్తువులు డెలివరీ అయ్యేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే కొన్నిచోట్ల అవాంచిత కారణాల వల్ల, డెలివరీ పార్టనర్‌తో సమస్యల వలన డెలివరీ ఆలస్యమవుతోంది. గతవారం చెందిన ఓ మహిళ ఫ్లిప్కార్ట్లో తాను ఆర్డర్ చేసిన ఫోన్ ఆలస్యంగా తీసుకువచ్చినందుకు డెలివరీ ఎగ్జిక్యూటివ్ ని గాయపరిచింది. అంతేకాదు.. Ola, Uber వంటి క్యాబ్ డ్రైవర్ల మీద కూడా దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ సంఘటనలో కొంతమంది ప్రయాణికులు కలిసి ఒక క్యాబ్ డ్రైవర్ ని హత్య చేశారు.

చాలా సందర్భాల్లో ఒక్కో డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఒక రోజులో 40 నుండి 45 వరకు డెలివరీలను చేయవలసి ఉంటుంది. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరుకోవడానికి పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర సమస్యల వలన ఆలస్యమవుతూ.. నిర్దేశిత సమయంలో డెలివరీలు పూర్తిచేయడానికి దాదాపు అర్ధరాత్రి వరకు కష్టపడవలసి వస్తోంది.

ఇవేమీ పట్టించుకోని కష్టమర్లు వారిపై దాడులకు దిగుతున్నారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో కొంతమంది శృతిమించి Cash On Deliveryలో వస్తువులను ఆర్డర్ చేసి తీరా వచ్చాక డబ్బు చెల్లించకుండా బలవంతంగా లాక్కోవడం.. రెండేళ్ల క్రితమైతే కేవలం ఒక ఫోన్ కోసం డెలివరీ బాయ్ ని బెంగుళూరులో హత్య చేయడం జరిగింది. వినియోగదారుల్లో పెరుగుతున్న ఈ విపరీత పరిణామాలు చూసి ఇ-కామర్స్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Previous Post