Google Tez వాడడం సేఫ్‌నా కాదా?

Admin 2018-04-05 Social

చాలాకాలంగా పలువురు ” కంప్యూటర్ ఎరా” పాఠకులు ఈ సందేహాన్ని వ్యక్తపరుస్తూ వచ్చారు. Google Tez ద్వారా ఒకరితో మరొకరు డబ్బులు పంపటం సురక్షితమేనా కాదా అన్నది సందేహం.

భారత ప్రభుత్వం విడుదల చేసిన BHIM, ఇతర ప్రైవేటు సంస్థలు అందిస్తున్నPaytm, PhonePe, Whatsapp Payments లాంటివి ఎలాగైతే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) విధానం ద్వారా చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నాయో అదేవిధంగా Google సంస్థ తీసుకువచ్చిన Tez యాప్ కూడా పనిచేస్తుంది. కాబట్టి దాన్ని సెక్యూరిటీ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవల్సిన పనిలేదు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే Google Tez ఆరు దశల్లో సెక్యూరిటీ కలిగి ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా మనం జరిపే ప్రతి లావాదేవీ 1. UPI PIN ద్వారానూ 2. Google PINతోనూ 3. Bank Securityతోనూ 4. Google Fraud Detectionతోనూ 5. Handset Security lookతోనూ 6. 24/7 సపోర్ట్‌తోనూ సురక్షితంగా ఉంచబడుతుంది. ముఖ్యంగా UPI విధానంలో అప్లికేషన్ యాక్సెస్ పరంగా సెక్యూరిటీ కల్పిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎటూ UPI PIN వాడిన తర్వాత మాత్రమే చెల్లింపులు జరపబడతాయి. చాలా మంది యూజర్లు Whatsapp Paymentsని మినహాయిస్తే మిగతా అన్ని అప్లికేషన్ల కన్నా Google Tez సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ పరంగా మాత్రం ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. మీ ఫోన్లో ఎలాంటి UPI అప్లికేషన్స్ వాడుతున్నా వీలైనంత వరకూ మీ ఫోన్ ఇతరుల చేతికి ఇవ్వడం, పొరబాటున కూడా మీ UPI PIN అవతలి వారికి చెప్పకపోవడం మంచిది.

Previous Post