నిషేధంపై సవాలు చేయం

Admin 2018-04-05 Sports

మెల్‌బోర్న్‌: బాల్‌ టాంపరింగ్‌ ఉదంతానికి బాధ్యులుగా తేలిన ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఇద్దరు తమపై పడ్డ నిషేధాన్ని సవాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. టాంపరింగ్‌ వ్యూహకర్తలుగా భావిస్తున్న కెప్టెన్‌ స్టీవెన్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లపై ఏడాది.. నేరుగా టాంపరింగ్‌కు పాల్పడిన బాన్‌క్రాఫ్ట్‌ 9 నెలలు నిషేధం పడ్డ సంగతి తెలిసిందే. క్రికెట్‌ ఆస్ట్రేలియా విధించిన ఈ శిక్షలపై సవాలు చేసేందుకు ఏప్రిల్‌ 11 వరకు గడువు ఉంది. అయితే స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ తాము ఆ పని చేయబోమని స్పష్టం చేశారు. ‘‘జట్టు సారథిగా జరిగిన దానికి పూర్తి బాధ్యత తీసుకుంటానని చెప్పాను. కాబట్టి నాకు పడ్డ శిక్షపై సవాలు చేయబోను’’ అని స్మిత్‌ ట్విటర్లో పేర్కొన్నాడు.

Previous Post