స్మిత్‌ మోసగాడు కాదు

Admin 2018-04-05 Sports

ముంబయి: బాల్‌ టాంపరింగ్‌ కుంభకోణం నేపథ్యంలో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ పట్ల భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ సానుభూతి వ్యక్తం చేశాడు. అతడు మోసగాడు కాదు అని అన్నాడు. ‘‘స్మిత్‌ పట్ల నాకు సానుభూతి ఉంది. వాళ్లు (స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌) తిరిగి వస్తారని, బాగా ఆడతారని ఆశిస్తున్నా. వాళ్లు చేసింది మోసం అనడం సరికాదు. వాళ్లకు మంచి జరగాలని కోరుకుంటున్నా’’ అని గంగూలీ చెప్పాడు.

Previous Post