ఇద్దరు ప్రియురాళ్ల... ముద్దుల ఆటగాడు ఒకేసారి ఇద్దర్నీ పెళ్లిచేసుకుంటున్నాడట

Admin 2018-05-25 Sports

రియోడిజనారియో: బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం రొనాల్డిన్హో ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోకున్నట్లు సమాచారం. 38 ఏళ్ల రొనాల్డిన్హో గత ఏడాది డిసెంబరు నుంచి రియోడిజనారియాలో తన ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. 2016 నుంచి బిట్రిజ్‌ సౌజాతో డేటింగ్‌లో ఉంటూనే రొనాల్డిన్హో ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రిస్కల్లాకి ప్రపోజ్‌ చేసి తన రిలేషన్‌షిప్‌ను కొనసాగించాడు.

తన ఇద్దరి ప్రియురాళ్లను ఆటగాడు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. గత ఏడాది జనవరిలో ఇరువురి ముందు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా వారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత వారికి ఎంగేజ్‌మెంట్‌ రింగ్స్‌ కూడా తొడిగాడు. అంతేకాదు ఇద్దరికి ప్రతి నెల రొనాల్డిన్హో కొంత పాకెట్‌ మనీ కూడా ఇస్తుంటాడట. అలాగే తాను ఎక్కడికి వెళ్లినా ఇద్దరికి ఒకేలాంటి కానుకలు తెస్తుంటాడు. గత ఏడాది రొనాల్డిన్హో తన ఇద్దరి ప్రియురాళ్లతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీనిపై అప్పుడు అతడ్ని వివరణ అడగ్గా.. ఎంగేజ్‌మెంట్‌ జరిగితే తప్పక చెబుతానని చెప్పాడు.

బ్రెజిల్‌లో ఒక నియమం ఉంది. ఒకసారి పెళ్లి అయిన వ్యక్తి మరోసారి పెళ్లి చేసుకుంటే అక్కడ చట్ట విరుద్ధం. దీన్ని అతిక్రమించిన వారికి సుమారు ఆరేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. ఈ కారణంగానే రొనాల్డిన్హో ఒకేసారి ఇద్దరు ప్రియురాళ్లను పెళ్లి చేసుకుంటున్నట్లు సమాచారం. బ్రెజిల్‌ తరఫున రెండు ఫిఫా ప్రపంచకప్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 2002 ప్రపంచకప్‌ గెలిచిన బ్రెజిల్‌ జట్టులో రొనాల్డిన్హో సభ్యుడు. మొత్తం 97 మ్యాచ్‌లకు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన అతడు 33 గోల్స్‌ సాధించాడు. ఈ ఏడాది జనవరి 16న రొనాల్డిన్హో ఆటకు వీడ్కోలు పలికాడు.

Previous Post