బీఎండబ్ల్యూ స్పెషల్‌ ఎడిషన్‌, ధరెంతంటే...

Admin 2018-04-05 Technology

బీఎండబ్ల్యూ తన 3-సిరీస్‌లో ఓ స్పెషల్‌ ఎడిషన్‌ను నేడు లాంచ్‌ చేసింది. షాడో ఎడిషన్‌గా దీనిని పేర్కొంది. పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో ఆఫర్‌ చేస్తున్న ఈ ఎడిషన్‌ను‌, పరిమితంగా అందుబాటులో ఉంచింది. దీని ధర ఎక్స్‌షోరూంలో రూ.41.40 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. పెట్రోల్‌ వేరియంట్‌ షాడో ఎడిషన్‌, ప్రస్తుతం స్టాండర్డ్‌ 330ఐ ఎం స్పోర్ట్‌ కంటే రూ.2.2 లక్షల ఖరీదైనదిగా ఉంది.

డిజైన్ల విషయానికి వస్తే, స్పోక్‌డ్‌ హెడ్‌లైట్‌, టైల్‌లైట్‌, హై-గ్లోస్‌ బ్లాక్‌ ఫిన్నిస్‌, భిన్నమైన డిజైన్లలో 18 ఇంచ్‌ అలాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. కారు అంతర్భాగాన 8.7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ విత్‌ ఆపిల్‌ కారుప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, 10.5 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ఎం స్పోర్ట్‌ లెదర్‌ స్టీరింగ్‌ వీల్‌ ఉన్నాయి. రివర్స్‌ కెమెరా, పార్కింగ్‌ సెన్సార్లు, 250 డబ్ల్యూ ఆడియో సిస్టమ్‌, వేరియబుల్‌ స్పోర్ట్‌ స్టీరింగ్‌ సిస్టమ్‌ వంటివి దీనిలో ఇతర ఫీచర్లు. మెకానిక్‌గా షాడో ఎడిషన్‌ మోడల్‌కు, స్టాండర్డ్‌ మోడల్‌కు పెద్దగా మార్పులేమీ లేవు. రెండు కూడా 2.0 లీటరు ఫోర్‌-సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, 2 లీటరు ఫోర్‌-సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి.

Previous Post