ఓలా గూటికి రైడ్లర్‌ యాప్‌

Admin 2018-04-08 Technology

టికెటింగ్, కమ్యూటింగ్‌ యాప్‌ రైడ్లర్‌ను క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఓలా కొనుగోలు చేసింది. మొటిలిటీ ప్లాట్‌ఫార్మ్‌ను ప్రజారవాణా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో అనుసంధానించే యత్నాలకు ఈ కొనుగోలు తోడ్పాటునందిస్తుందని ఓలా తెలిపింది. రవాణా సేవలను మరింత సమర్థవంతంగా అందించడానికి రైడ్లర్‌ కొనుగోలు ఉపకరిస్తుందని ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ చెప్పారు.

ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. రైడ్లర్‌లోని 64 మంది ఉద్యోగులు ఓలాలో ఒక భాగమవుతారని, ఇక నుంచి రైడ్లర్‌ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ పూర్తి అనుబంధ సంస్థగా కొనసాగుతుందని అగర్వాల్‌ పేర్కొన్నారు. 2012లో ముంబై కేంద్రంగా రైడ్లర్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ యాప్‌తో ప్రజా రవాణా ఆప్షన్స్‌ సెర్చి చేయడం, బుక్‌ చేయడం చేసుకోవచ్చు.

Previous Post