లక్షరూపాయల వరకు అందరికీ అప్పు ఇవ్వబోతున్న Xiaomi FacebookWhatsApp

Admin 2018-05-25 Technology

Xiaomi సంస్థ ఈ మధ్యకాలంలో ఎప్పటికప్పుడు వినూత్నమైన ప్రణాళికలతో వస్తోంది. గత కొంతకాలంగా ఇండియాలో ఉన్న startup కంపెనీలకు ఫండింగ్ ఇవ్వడం మొదలుపెట్టిన ఈ సంస్థ తాజాగా మరో కొత్త ప్లాన్ తో వచ్చింది.

Mi Credit అనే సరికొత్త ప్రోగ్రాం ద్వారా Xiaomi సంస్థకు చెందిన స్మార్ట్ఫోన్లు వాడుతున్న వినియోగదారులు వెయ్యి రూపాయలు మొదలుకొని గరిష్టంగా లక్షరూపాయల వరకు Xiaomi సంస్థ నుండి అప్పు తీసుకోవచ్చు. అయితే ఇతర ఫోన్లు వాడుతున్న వారికి ఇది లభించదు. ప్రత్యేకంగా తమ ఫోన్లలో MIUI ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయబడి ఉన్నప్పుడు మాత్రమే ఇలా తమకు కావల్సినంత అప్పు పొందటానికి అప్లై చేసుకోవచ్చు. ఇది MIUIకే పరిమితం కావడం వలన అదే సంస్థ తయారు చేసిన Android Stock ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న Mi A1 వినియోగదారులకు మాత్రం ఈ సదుపాయం లభించదు.

Mi Credits రూపంలో ఇవ్వబడే ఈ అప్పుని ఆధార్ కార్డ్, పాన్ కార్డు వివరాల సమర్పించడం ద్వారా కేవలం 10 నిమిషాల్లో ఈ లింక్ నుండి పొందొచ్చు. ఎంత మొత్తంలో అప్పు తీసుకుంటున్నారు, ఎంత కాలం గడువు కోరుతున్నారు అన్న దాన్ని బట్టి వడ్డీరేటు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 1000 నుండి 9000 రూపాయలు 15 రోజుల పాటు తీసుకుంటే 1.48 శాతం అప్పు ఇవ్వబడుతుంది. ఒకవేళ పదివేల నుండి లక్ష రూపాయల వరకు తీసుకుంటే సంవత్సరానికి 36 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారీ మొత్తమే అయినా అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడుతుంది.

KreditBee అనే startup సహకారంతో షామీ సంస్థ ఈ సదుపాయాన్ని అందిస్తోంది. KYC వివరాలు సమర్పించిన తర్వాత ఆ వెరిఫికేషన్ ప్రాసెస్‌ని ఇదే సంస్థ పూర్తి చేస్తుంది.

Previous Post