RC16: ఆసక్తికర విషయాన్ని పంచుకున్న దర్శకుడు బుచ్చిబాబు
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో RC 16 పట్టాలెక్కిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ మైసూర్ లో జరుపుకుంటోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవర చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార జాన్వికి ఈ చిత్రం రెండవది. దేవర చిత్రానికి గాను తన అందం, అభినయంతో మంచి మార్కులే కొట్టేసింది.
అయితే ఈ సినిమాకు సంబందించిన ఒక ఆసక్తికర విషయాన్నీ అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు బుచ్చిబాబు. “అవర్ భయ్యా… యువర్ భయ్యా.. మున్నా భయ్యా. వెల్కమ్ ఆన్ బోర్డు డియర్ దేవ్యేంద్రు బ్రదర్. లెట్స్ రాక్ ఇట్” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. బాలీవుడ్ నటుడు దేవ్యేంద్రు మీర్జాపూర్ సిరీస్ తో అలరించారు.
మొదటి చిత్రం ఉప్పెనతో అందరి మన్ననలు పొందిన దర్శకుడు బుచ్చిబాబు ఈ RC 16 కోసం రెండేళ్ల నుండి పనిచేస్తున్నారు.
ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు కూడా పూర్తి చేసినట్టు సమాచారం.
జగపతి బాబు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందిన రామ్ చరణ్ భారీ చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల రిలీజ్ అయిన పాటలన్నీ ఒక ఊపు ఊపుతున్నాయి. ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ బద్దలవుతాయని రామ్ చరణ్ ఫాన్స్ అంటున్నారు.